చిన్నారుల కళా చైతన్యం
శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని పలు చోట్ల భక్తులు ప్రత్యేక పూజలు చేపట్టారు. స్వామీజీ విశిష్టతను తెలియ చేస్తూ పురవీధుల ద్వారా యాత్రలు నిర్వహించారు. ప్రతి చోటా వికాస తరంగిణి ఆధ్వర్యంలో సుశిక్షుతులైన కార్యకర్తలు, సభ్యులు ర్యాలీలను విజయవంతం చేయడంలో సఫలీకృతులయ్యారు. కొన్ని చోట్ల సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టగా మరికొన్ని చోట్ల కళారూపాలను ప్రదర్శించారు. రాజాంలో వికాస తరంగిణి బాధ్యులు రమణమూర్తి ఆధ్వర్యంలో తాగునీటి సంరక్షణ తీసుకోవాల్సిన చర్యలు అనే అంశంపై చిన్నారులకు చిత్రలేఖనంలో పోటీలు నిర్వహించారు. [...]