.fusion-tabs.fusion-tabs-1 .nav-tabs li a{border-top-color:#ebeaea;background-color:#ebeaea;}.fusion-tabs.fusion-tabs-1 .nav-tabs{background-color:#ffffff;}.fusion-tabs.fusion-tabs-1 .nav-tabs li.active a,.fusion-tabs.fusion-tabs-1 .nav-tabs li.active a:hover,.fusion-tabs.fusion-tabs-1 .nav-tabs li.active a:focus{border-right-color:#ffffff;}.fusion-tabs.fusion-tabs-1 .nav-tabs li.active a,.fusion-tabs.fusion-tabs-1 .nav-tabs li.active a:hover,.fusion-tabs.fusion-tabs-1 .nav-tabs li.active a:focus{background-color:#ffffff;}.fusion-tabs.fusion-tabs-1 .nav-tabs li a:hover{background-color:#ffffff;border-top-color:#ffffff;}.fusion-tabs.fusion-tabs-1 .tab-pane{background-color:#ffffff;}.fusion-tabs.fusion-tabs-1 .nav,.fusion-tabs.fusion-tabs-1 .nav-tabs,.fusion-tabs.fusion-tabs-1 .tab-content .tab-pane{border-color:#ebeaea;}

                                                        శోభాయ‌మానం బ్రహ్మోత్స‌వం ..!

చూసేందుకు క‌నులు చాలవు. మాన‌వ జ‌న్మ‌లో అత్యంత ఆహ్లాద‌క‌ర‌మైన స‌న్నివేశం ఇవాళ చోటు చేసుకున్న‌ది. అది లోక బాంధ‌వుడు..న‌డిచే నారాయ‌ణుడిగా పేరొందిన శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి చిన‌జీయ‌ర్ స్వామీజీ దివ్య సాకేతం ఆశ్ర‌మం భ‌క్తుల‌తో నిండి పోయింది. ఎక్క‌డ చూసినా  ఆ రామానుజుల స్మ‌ర‌ణే వినిపిస్తోంది. జై శ్రీ‌మ‌న్నారాయ‌ణ అంటూ మూల మంత్రం భ‌క్తుల పెద‌వుల మీద న‌ర్తిస్తోంది. పిల్ల‌లు, పెద్ద‌లు, వృద్దులు, మ‌హిళ‌లు ఇలా ప్ర‌తి ఒక్క‌రు భ‌గ‌వ‌త్ రామానుజుల వారిని స్మ‌రిస్తూ ఉన్నారు. ఈ పుణ్య క్షేత్రంలో 8వ వార్షిక బ్రహ్మోత్స‌వాల‌కు వేదికైంది. ఆల‌య ప్రాంగ‌ణ‌మంతా విద్యుత్ కాంతుల‌తో నిండి పోయింది. ప్ర‌త్యేక దీపాల‌ను అలంక‌రించారు. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బంది త‌లెత్త‌కుండా  ముందు జాగ్ర‌త్త‌గా షామియానాలు ఏర్పాటు చేశారు. హృద‌యాల‌ను తేలిక ప‌రిచేందుకు స‌న్నాయి, పూల‌తో అలంక‌ర‌ణ భ‌క్తుల‌ను ఎంత‌గానో  ఆక‌ట్టుకుంది. బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా అన్ని దేవ‌త‌ల‌కు పెద్ద‌గా భావించే గ‌రుడ పాఠాన్ని వినిపించారు. సూర్య ప్ర‌భ వాహ‌నం మీదుగా శ్రీ‌రాముడి విగ్ర‌హాన్ని ఊరేగించారు. ప‌ల్ల‌కీ సేవ ఆక‌ట్టుకుంది. ఆల‌య ప‌రిస‌రాల‌తో పాటు యాగ‌శాల‌ను కూడా ముస్తాబు చేశారు.  అగ్ని దేవుడి కిర‌ణాలు సోకేలా య‌జ్ఞ యాగం జ‌రిగింది. పంచ‌సూక్తాలు, మంత్రాల‌తో అగ్ని దేవుడికి పూజ‌లు నిర్వ‌హించారు. ఇక శ్రీ ల‌క్ష్మి నారాయ‌ణ పూజను దేవ‌నాథ జీయ‌ర్ స్వామీజీ చేయ‌గా శ్రీ‌శ్రీశ్రీ త్రిదండి చిన‌జీయ‌ర్ స్వామీజీ స్వామి వారికి వివిధ పూల‌తో పూజ‌లు చేశారు. పూర్ణాహుతి కార్య‌క్ర‌మం ముగిసిన అనంత‌రం భ‌క్తుల‌కు స్వామీ వారి చేతుల మీదుగా తీర్థం, ప్ర‌సాదాన్ని పంపిణీ చేశారు. దీంతో శుక్ర‌వారం  బ్ర‌హ్మోత్స‌వం భ‌క్తుల‌ను మైమ‌రిచి పోయేలా చేసింది. సుదూర ప్రాంతాల నుంచి వ‌చ్చిన భ‌క్త‌జ‌నం స్వామి వారి మంగ‌ళాశాస‌నాల‌తో  ధ‌న్యుల‌య్యారు.

Divyasaketham is celebrating the 8th Bramhothsavams. The temple grounds took a festive look with the special lighting, shamiyanas, sounds of music from the sannai, fragrant flower decorations and hustle and bustle of the devotees. The event started today with the hoisting of the Garuda patam. Garuda is in-charge of the hospitality for devathas who come to attend the Lord’s bramhothsavams.

Lord Sri Rama was taken on a procession on Surya prabha vahanam. The new pattangas (carriers of the palanquin of the Lord) enthusiastically took in the Lord in delicate yet majestic steps around the temple and then led Him towards the Yagasala.

Meanwhile in the yagasala, Agni devatha was invoked using the sun rays and that fire was transferred in all the homa kundas to start the havan. For Bramhothsavams, fire is invoked using this process. For yagas, fire is invoked using the churning process while for regular temple activities, fire is taken from the temple kitchen itself. Yaga beri – Lord who accepts prayers in yaga sala was seated majestically in the yaga mandapam. Pancha suktha homas and manthras were chanted offering oblations to Fire God.

Today being Friday, Sri Lakshmi Narayana puja was performed. Devanattha Jeeyar Swamy chanted the namavali while HH Chinna Jeeyar Swamiji offered flowers to the Lord. After purnahuthi, thirttham and prasadam were distributed to the devotees concluding the morning program.

Click Here For More Photos

The post Bramhothsavam Day 2 – Morning Program appeared first on Chinnajeeyar.

Source: Jiva News